ప్రభాస్ మీద 2000 కోట్ల బిజినెస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా తనదైన బ్రాండ్ తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిర్మాతలు అందరూ వందల కోట్ల రూపాయిల బడ్జెట్ తో ప్రభాస్ తో యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్ లతో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం అతని చేతిలో నాలుగు సినిమాలు ప్రస్తుతం ఉన్నాయి.

ఇందులో ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. టి-సిరీస్ భూషణ్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతుంది. సుమారు దీనిపై 350 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.

అయితే వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తోనే ఈ చిత్రం థియేటర్స్ లోకి వస్తోంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది 300 కోట్లకి పైగా బడ్జెట్ తోనే ఈ సినిమా నిర్మితం అవుతోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీపై 600 నుంచి 700 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందంట.

అలాగే ఈ మూవీతో కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ రికార్డ్ పై హోంబలే ఫిలిమ్స్ కన్నేసింది. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీని సుమారు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాపై 800 కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇండియన్ హాలీవుడ్ మూవీగా దీనిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.

దీని తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తోన్న హర్రర్ థ్రిల్లర్ వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై 250 నుంచి 300 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ నాలుగు సినిమాల ద్వారా 2 వేల కోట్ల వరకు ప్రభాస్ పైన మార్కెట్ జరుగుతోంది. ఇందులో మూడు సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఏ స్థాయిలో ప్రభాస్ నిర్మాతల నమ్మకాన్ని నిలబెడతాడు అనేది వేచి చూడలి.