సీన్ కాపీ కొట్టినా సినిమా డిజాస్టర్ అయినా కూడా త్రివిక్రమ్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. కాపీ కొట్టినా కూడా ఆకట్టుకునే విదంగా ప్లాన్ చేసుకోవడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన నెక్స్ట్ ఎన్టీఆర్ తో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.
ఇక సినిమా చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ మాదిరిగా త్రివిక్రమ్ వేరే సినిమాలకు డైలాగ్స్ అందించడానికి రెడీ అవుతున్నాడాట. అవసరం అయితే కథ కథనం చర్చల్లో కూడా పాల్గొంటున్నారట. పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న బిగ్ మల్టీస్టారర్ సినిమా అయ్యప్పన్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడట. అలాగే రానా దగ్గుబాటి, గుణశేఖర్ కాంబోలో రానున్న హిరణ్యకశిప సినిమాకు కూడా డైలాగ్స్ రాయడానికి ఒప్పుకున్నాడని టాక్.
ఈ ఒక్క సినిమాకు 5కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇక అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాతలతో కలిసి తెరకెక్కించనున్న మరో రామాయణం కథకు స్పెషల్ గా స్క్రీన్ ప్లే అందించి మాటలు రాయనున్న త్రివిక్రమ్ దానికి కూడా ఇదే రేంజ్ లో పారితోషికం అందుకొనున్నట్లు సమాచారం. చూస్తుంటే ఒక వైపు డైరెక్షన్ తోనే కాకుండా మరోవైపు ఇలా మాటలు రాస్తూ కూడా తన ఆదయాన్ని.పెంచుకుంటున్నాడు త్రివిక్రమ్.