దివంగత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ నటుడిగా గుర్తింపు సాధించలేకపోయినా కూడా నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. అల్లు అరవింద్ నిర్మాతగా గీత ఆర్ట్స్ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలను రూపొందించాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సంస్థగా గుర్తింపు పొందిన గీత ఆర్ట్ స్టూడియో కి ఆ పేరు పెట్టడానికి చాలా బలమైన కారణం ఉందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ విషయం గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ… ఈ సంస్థకు అల్లు రామలింగయ్య “గీతా ఆర్ట్స్” అని నామకరణ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అల్లు రామలింగయ్య గారికి భగవద్గీత సారాంశం బాగా నచ్చడం వల్ల ఆ పేరు పెట్టారని అల్లు అరవింద్ వెల్లడించారు. పైగా ఈ పేరు సినిమాలకు సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
ఇక ఈ బ్యానర్ పై ఎంతోమంది స్టార్ హీరోలు నటించారని… గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన అన్ని చిత్రాలు దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయని అల్లు అరవింద్ వెల్లడించాడు. ఇక ఈ బ్యానర్ మీద తెరకెక్కించిన మగధీర సినిమా అనుకున్న దానికన్నా 80% ఎక్కువ బడ్జెట్ పెట్టవలసి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మించడమే కాకుండా ఇతర భాషలకు సంబంధించిన సినిమాలను తెలుగులో విడుదల చేయటానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఈ బ్యానర్ పై విడుదల చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి హిట్ అయ్యాయని ఈ సందర్భంగా వెల్లడించారు.