సౌత్ ఇండియన్ బిగెస్ట్ హ్యాట్రిక్ కాంబో.. మరోసారి తెరపైకి

vijay held emergency meeting with his fans associations leaders

సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్ ఏది అంటే విజయ్, అట్లీ అనే చెప్పాలి. తేరి సినిమాతో మొదలైన ఈ బాక్సాఫీస్ కాంబో ఆ తరువాత మెర్శల్ ద్వారా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన బిగిల్ ఏ స్థాయిలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మినిమమ్ మూడు వంధల కోట్ల బిజినెస్ జరగడం కామన్. ఇక బడ్జెట్ అయితే 200కోట్లు ఉంటుంది.

                

హ్యాట్రిక్ హిట్స్ అనంతరం మరోసారి అట్లీ, విజయ్ కలవబోతున్నారు అనే రూమర్స్ చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల విజయ్ అకస్మాత్తుగా అట్లీ ఆఫీస్ కు వెళ్లడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే మరో సినిమా చేయడానికి ఇద్దరు సిద్ధమైనట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఒకవేళ ప్రాజెక్టు ఫిక్స్ అయినా కూడా ఇప్పట్లో తెరపైకి రాకపోవచ్చు. ఎందుకంటే విజయ్ మాస్టర్ ను రిలీజ్ చేయగానే హెచ్.వినోథ్ లేదా మురగదాస్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు అట్లీ షారుక్ ఖాన్ తో సంఖి అనే సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు గాని ఈ కాంబో వచ్చే ఏడాది సెట్స్ పైకి రావచ్చని టాక్ అయితే వస్తోంది. దీంతో విజయ్ ప్రాజెక్టుపై అట్లీ ఇప్పట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం లేదని సమాచారం.