మన శరీరానికి అన్ని పోషకాలు సరైన స్థాయిలో అందాలి. పోషకాలు ఏ మాత్రం తగ్గిన కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే. శరీరంలో తగినంతగా జింక్ లేని పక్షంలో జుట్టు రాలే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చేతి గోళ్లు పాలిపోయినట్టు కనిపిస్తే కూడా శరీరంలో జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. జింక్ లోపం వల్ల కొన్ని సందర్భాల్లో రేచీకటి వచ్చే ఛాన్స్ ఉంది.
జింక్ లోపం వల్ల కొంతమంది దృష్టి లోపం సమస్యతో బాధ పడుతూ ఉంటారు. చర్మం ఎక్కువగా పొడి బారుతున్నా జింక్ లోపం వల్లే ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. శరీరంలో జింక్ శాతం తక్కువగా ఉంటే ఇప్పటికే ఉన్న గాయాలు మానే అవకాశాలు అయితే ఉంటాయి. జింక్ లోపం ఉంటే మానసిక అశాంతి, డిప్రెషన్ వంటి సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.
అకస్మాత్తుగా ఆకలి తగ్గడం కూడా జింక్ లోపానికి సంకేతాలు అని చెప్పవచ్చు. శరీరంలో తగినంత జింక్ ఉంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. జలుబు, ఫ్లూ సమస్యలు తరచూ తలెత్తుతుంటే కూడా జింక్ లోపం ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే ఆరోగ్యానికి మేలు కలిగే అవకాశాలు ఉంటాయి. శనగలు, సీ ఫుడ్, గుమ్మడికాయ గింజలు తీసుకుంటే జింక్ లోపానికి చెక్ పెట్టవచ్చు.
మొటిమలు, తామర, చర్మం పొడిబారడం లాంటి సమస్యల బారిన పడితే కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తిన్న తిండి రుచి లేకపోవడం కూడా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్లను నిర్వహించడంలో జింక్ తోడ్పడుతుంది.