సాధారణంగా మనలో చాలామంది వేసవి సీజన్ లో లభించే రుచికరమైన మామిడి పండ్లను తినడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మామిడిపండు అద్భుతమైన రుచితో పాటు ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అలాగే మామిడి ఆకుల్లో కూడా మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మామిడి ఆకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు, అత్యధికంగా ఫైబర్ లభిస్తుంది.
ప్రతిరోజు ఉదయాన్నే మామిడి ఆకుల కషాయాన్ని సేవిస్తే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు మామిడి ఆకుల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.దాదాపు10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లలో బాగా మరగనివ్వాలి. చల్లబడిన తర్వాత ఈ నీటిని వడగట్టుకుని ఉదయాన్నే ప్రతిరోజు పరగడుపున సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ చిట్కాను పాటించాలి అనుకుంటే మొదట నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ప్రతిరోజు ఈ మామిడి కషాయాన్ని సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్, శక్తివంతమైన ఆక్సిడెంట్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి రక్తంలో చక్కర నిల్వల స్థాయిని తగ్గిస్తాయి. తద్వారా షుగర్ వ్యాధినీ అదుపులో ఉంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే మామిడి ఆకుల కషాయాన్ని సేవిస్తూ చెడు కొలెస్ట్రాల్ ను సహజ పద్ధతిలో తగ్గించుకోవచ్చు తద్వారా ఊబకాయం అతిబరువు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే రక్తనాళాలు శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి మామిడి కాషాయం దివ్య ఔషధంలా పనిచేస్తుంది. చిన్న వయస్సులోనే కంటి చూపు మందగించి ఇబ్బంది పడుతున్న వారు ఈ కషాయాన్ని సేవిస్తే కంటిచూపు మెరుగుపడే అవకాశాలు నిండుగా ఉంటాయి.