మొదటి రాత్రి రోజు ఎక్కువ మంది చేసే పొరపాట్లు ఇవే?

పెళ్లయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగా కావడానికి చేసే కార్యక్రమమే మొదటి రాత్రి. మొదటి రాత్రి రోజు ఎంతోమంది వధూవరులు కాస్త అసౌకర్యంగాను అభద్రతకు లోనవుతూ ఉంటారు. ఇలా అభద్రత భావం వల్ల కొన్ని సార్లు మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి.ముఖ్యంగా వధువు ఇలాంటి అబధ్రత భావానికి ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఈ సమయంలోనే వరుడు తనని దగ్గరగా తీసుకొని ప్రేమగా ముందు తనకు ధైర్యం చెప్పాలి. ఇలా మంచి మాటలు మాట్లాడుతూ తనలో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టాలి.

ఇకపోతే చాలామంది మొదటి రోజు రాత్రి తమ జీవిత భాగస్వామితో కలవబోతున్న నేపథ్యంలో చాలా ఆత్రుత కనపరుస్తూ ఉంటారు. అయితే కొంతమంది మద్యం తాగి వచ్చి శోభనం గదిలోకి వెళ్తుంటారు. ఇది పూర్తిగా తప్పు మీ పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వధువుకు మీపై ఇంప్రెషన్ అక్కడే తగ్గిపోతుంది.ఇలా తాగి గదిలోకి వెళ్లడం వల్ల తాను అభద్రత భావానికి గురి అవ్వడమే కాకుండా మీ పట్ల ఒక చెడు అభిప్రాయానికి వస్తుంది.

అదేవిధంగా మొదటి రోజు రాత్రి చాలామంది సినిమాలలో చూపించిన విధంగా ఏదో చేయాలని తాపత్రయపడుతుంటారు. ఇది పూర్తిగా తప్పు. మొదటి రోజు రాత్రి అబ్బాయిలు ఎప్పుడూ కూడా సెక్స్ చేయడానికి ఆత్రుత కనపరచకూడదు.ఎందుకంటే మొదటిసారి కలయికలో పాల్గొన్నప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అభద్రత భావానికి లోనవుతారు కనుక కొన్నిసార్లు కలయిక పూర్తిగా సక్సెస్ కాకపోవచ్చు అలాగని పోర్న్ వీడియోలు చూసి కూడా కలయికలో పాల్గొనకూడదు.పోర్న్ వీడియోలు చూసిన తర్వాత నిజజీవితంలో తమకు అలాంటి సంతృప్తి కలగలేదని చాలామంది నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు కనుక ఇది కూడా పూర్తిగా తప్పేనని నిపుణులు చెబుతున్నారు.