పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. రూ.95 తో ఏకంగా రూ.14 లక్షలు పొందే ఛాన్స్?

కేంద్ర ప్రభుత్వం ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో గ్రామ్ సుమంగళ్ గ్రామీణ డాక్ జీవన్ బీమా యోజన స్కీమ్ ఒకటి కాగా రోజుకు కేవలం 95 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 14 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు జీవిత బీమా కవర్ తో పాటు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

గ్రామీణ ప్రాంతాలలో నివశించే వాళ్లకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను మెచ్యూరిటీకి ముందే పొందే అవకాశం అయితే ఉంటుంది. 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు 20 సంవత్సరాల కోసం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. పెట్టుబడిదారు మరణిస్తే నామినీ బోనస్ తో పాటు హామీ మొత్తం పొందే అవకాశం ఉంటుంది.

మెచ్యూరిటీకి చేరుకున్న సమయంలో బోనస్ తో పాటు 40 శాతం పొందే అవకాశం ఉండగా ఎనిమిది, పన్నెండు, పదహారు సంవత్సరాలకు 20 శాతం చొప్పున పొందవచ్చు. 25 సంవత్సరాల వయస్సులో నెలకు 2853 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో 40 లక్షల రూపాయలు సొంతమవుతాయి. దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది.

సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంది.