లైఫ్ హ్యాపీ గా ఉండాలంటే… లైఫ్ పార్టనర్ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ సాగిపోయే దాంపత్య జీవితం ఎక్కువకాలం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. అలాకాకుండా ఒకరినీ గురించి మరొకరు పట్టించుకోకుండా ఎవరికి తోచింది వారు చేసుకుంటూ వెళ్తే అనేక సమస్యలు తలెత్తి ఆ రిలేషన్ మధ్యలోనే బ్రేకప్ అవుతుంది. నిజానికి ఒకరి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. అందులో భాగస్వామి మనసు తెలుసుకోవడం చాలా కష్టం అనే చెప్పాలి.కానీ వారు చేసే కొన్ని పనులు వాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో కొంతవరకు అంచనా వేయవచ్చు. మన భాగస్వామి చేసే కొన్ని పనుల ద్వారా మనతో వారు హ్యాపీగా ఉంటున్నారా లేక అసంతృప్తిగా ఉంటున్నారా అన్న విషయాలను కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు.

సహజంగా భార్యాభర్తలిద్దరూ ఎక్కువ సమయం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. అలా కాకుండా మీ భాగస్వామి మీతో గడిపే సమయం తగ్గించి ఫ్రెండ్స్ తోనూ బంధువులతోనూ ఎక్కువ సమయం గడుపుతుంటే మీ మధ్య ఏదో సమస్య తలెత్తిందని, మీ పట్ల మీ భాగస్వామి అసంతృప్తిగా ఉంటూ మీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం. ఇలాంటి సంకేతాలు మీ లైఫ్ పార్టనర్ లో కనిపిస్తే వెంటనే మీ పద్ధతిని మార్చుకొని మీ భాగస్వామితో ఎక్కువ సమయం ఏకాంతంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం లభించి మీ బంధం మరింత బలంగా తయారవుతుంది

దాంపత్య జీవనంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఇద్దరు కలిసి సమస్యను పరిష్కరించుకున్నప్పుడు బంధం మరింత బలపడుతుంది అలా కాకుండా సమస్యను పరిష్కరించుకోవడానికి మీ పార్ట్నర్ ఇష్టపడకపోతే మీ ఇద్దరి మధ్య బంధం తెగిపోయే ప్రమాదం ఉంది.ఒకరు సమస్యతో బాధపడుతుంటే మరొకరు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.అప్పుడే ఆ బంధం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. శృంగారం మరీ ఎక్కువైనా ఏదో సమస్య ఉన్నట్లే ఎందుకంటే శృంగారం ద్వారా దంపతుల మధ్య చాలా సమస్యలు తీరతాయని తెలిసిందే. ఇదే మీ భాగస్వామి ఆలోచిస్తూ దాంపత్యంలో శృంగారాన్ని ఎక్కువ చేసి ఉండొచ్చు. కాబట్టి మి లైంగిక జీవితంలో ఈ మార్పును గమనించినట్లయితే ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. మీ భాగస్వామి మీ పట్ల చిరాకు, కోపం, అసహ్యం పెంచుకుందంటే మీరంటే ఇష్టం లేదని అర్థం చేసుకొని పరిస్థితులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది.