పదో తరగతి అర్హతతో తిరుపతిలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఏపీలోని తిరుపతిలో పని చేయాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలలో పని చేయాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేయాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మొత్తం 26 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీడీసీఏ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. https://tirupati.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మెకానిక్, డీఈఓ, జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఆఫీస్ సబార్డినేట్, నర్సింగ్ ఆర్డర్లీ, మార్చురీ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఎలక్ట్రీషియన్, మెకానిక్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ కార్యాలయం, ఎస్వీ మెడికల్ కళాశాల, తిరుపతి చిరునామాకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. 2023 సంవత్సరం నవంబర్ 28వ తేదీ ఈ ఉద్యోగాలకు చివరి తేదీగా ఉండాలి.

విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.