మనలో చాలామంది ఏ పనులను ఏరోజు చేయాలనే విషయాలకు సంబంధించి అవగాహన కలిగి ఉంటారు. కొన్ని పనులను కొన్ని రోజులు చేయడం ఏ మాత్రం శుభకరం కాదు. హిందూ మతాన్ని నమ్మే వాళ్లు రోజును బట్టి ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? అనే విషయాల గురించి అవగాహనను కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు. గురువారం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా కష్టాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
గురువారం రోజున డబ్బు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు. ఈ రెండు పనులు చేస్తే లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెప్పవచ్చు. గురువారం రోజున మద్యం, మాంసం, వెల్లుల్లి, ఉల్లి తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. కళ్లకు సంబంధించిన వస్తువులను గురువారం కొనుగోలు చేయడం మంచిది కాదని చెప్పవచ్చు. గురువారం రోజున బట్టలు ఉతకడం ఏ మాత్రం మంచిది కాదు.
మాసిన బట్టలను కూడా ఆరోజు ఉతకకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎవరైతే ఈ విధంగా బట్టలు ఉతుకుతారో వాళ్లపై విష్ణుమూర్తికి కోపం వస్తుంది. గురువారం రోజున ఇంటిని నీటితో శుభ్రం చెయ్యకూడదు. ముందురోజే తడిబట్ట వేసుకుని తుడుచుకోవాలి. గురువారం రోజున తలస్నానం చేయకూడదు. తల స్నానం చేయడం వల్ల చెడు ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి.
గురువారం నాడు చేతులు, కాళ్ళ గోళ్ళను కత్తిరించుకోవడం సరికాదు. ఈ విధంగా చేస్తే ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. గురువారం రోజున జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం కూడా మంచిది కాదు.