ప్రస్తుత కాలంలో ప్రతి విషయం డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు వారి పిల్లల పెంపకంలో చాలా అవస్థలు పడుతున్నారు. పిల్లలు పుట్టిన దగ్గర నుండి వారి చదువుకు అయ్యే ఖర్చులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు వారిని చదివించి పెళ్లి చేయటానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఆడపిల్లలు పుడితేనే వారిని భారంగా భావించి చెత్తకుప్పల్లో పడేస్తూ అనాధలని చేస్తున్నారు. దీంతో ఆడపిల్లల సంరక్షణకై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇక ఆడపిల్లలు బంగారు భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని 2015లో ప్రవేశపెట్టింది.
ఈ స్కీం ప్రవేశపెట్టిన 48 గంటల్లోనే 10 లక్షల మంది ఖాతాలు తెరిచారు. అయితే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందాలంటే కుమార్తె పేరు మీద ఖాతా తెరవాల్సి ఉంది. ఆడపిల్ల విద్య నుంచి పెళ్లి వరకు అన్ని ఖర్చులకి ఈ డబ్బు వాడచ్చు. బేటీ బచావో బేటీ పఢావో మిషన్ కింద మోదీ సర్కార్ ఈ స్కీమ్ ని ప్రవేశపెట్టింది. అయితే 2023బడ్జెట్ తర్వాత, ఈ పథకాన్ని మరింత మందికి చేరువ చెయ్యడానికి పోస్టల్ శాఖ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఆడపిల్లల పేరు మీద 15 ఏళ్ల పాటు ఖాతా ని తెరవచ్చు.ఇందులో పెట్టిన డబ్బు కి ప్రభుత్వం ఎక్కువ వడ్డీని అందిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాలు :
• సుకన్య సమృద్ధి యోజన పథకానికి కేంద్రం 7.60 శాతం వడ్డీ ని ఇస్తోంది.
• మీ అమ్మాయి పేరు మీద ఈ స్కీం ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడానికి సమీపంలోని బ్యాంక్ లేదా పోస్టాఫీసుకి వెళ్లి ఈ అకౌంట్ ని తెరవవచ్చు.
• ఇక అమ్మాయి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీసం 250 రూపాయలు డిపాజిట్ చెయ్యచ్చు.
• ఈ స్కీం లో డబ్బులు పొదుపు చేయాలనుకునేవారు నెల లేదా సంవత్సరం లో ఎన్ని సార్లయినా డిపాజిట్ చేయవచ్చు.
• సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టాలి.
• అయితే కుటుంబంలో కేవలం ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మాత్రమే తెరవగలరు.
• ఆడపిల్ల జన్మించినప్పటి నుంచి 10 ఏళ్ల లోపు ఆడపిల్లల కోసం ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టచ్చు.