శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు..?

మన హిందూ సంస్కృతి ప్రకారం మాఘమాసం చాలా పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ మాఘ మాసంలో ప్రజలందరూ పరమశివుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మాఘ మాసంలో ప్రతిరోజు ఉదయం భాగస్నానం చేసి ఆ తర్వాత శివుడిని పూజించటం ప్రత్యేకత. ఇక మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా ప్రజలందరూ ఎంతో సాంప్రదాయపద్ధంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున నిష్టగా ఉపవాస దీక్ష, జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించటం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రజల విశ్వాసం. అయితే పరమ పవిత్రమైన ఈ శివరాత్రి పర్వదినం రోజున కొన్ని పనులు చేయటం వల్ల శివుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. శివరాత్రి రోజున చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఆహారాలను ఎట్టి పరిస్థితులలోనూ తీసుకోకూడదు.
• అలాగే మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తో పాటు పొగాకు, మద్యానికి కూడా దూరంగా ఉండాలి.
• శివరాత్రి రోజున మాంసం తిని మద్యం సేవించటం మహా పాపం.
• అలాగే శివరాత్రి రోజున ఆలయానికి వెళ్ళిన వారు శివలింగానికి కొబ్బరి నీరు సమర్పించకూడదు.
• అలాగే శివుడిని పూజించే సమయంలో పూజ కోసం స్టీల్ వస్తువులను అసలు ఉపయోగించకూడదు.
• ముఖ్యంగా శివరాత్రి రోజున నలుపు రంగు బట్టలు ధరించడం మంచిది కాదు.
• అలాగే శివుడిని పూజించే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను శివుడికి సమర్పించకూడదు.

శివరాత్రి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర నిద్రలేచి ఆ తర్వాత నదీ జలాలలో స్నానం ఆచరించి ఉపవాస దీక్షతో ఉంటూ భక్తిశ్రద్ధలతో శివుడిని ఆరాధించడం వల్ల శివుడి అనుగ్రహం లభించి జీవితంలో సుఖసంతోషాలు ప్రవేశిస్తాయి.