సాధారణంగా శివరాత్రి వచ్చిందంటే చాలు మార్కెట్లో మనకు కందగడ్డలు దర్శనమిస్తాయి ఏడాదిలో కందగడ్డలు ఈ నెలలో మాత్రమే మార్కెట్లోకి వస్తుంటాయి.ఇలా మార్కెట్లో లభించే ఈ కందగడ్డలను శివరాత్రికి ప్రత్యేకంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.ఇలా శివరాత్రి రోజు కందగడ్డలను శివుడికి నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో అసలు శివరాత్రికి కందగడ్డలకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే…
శివరాత్రి రోజు శివుడికి కందగడ్డలను నైవేద్యంగా సమర్పించి ఆరోజు ఉపవాస దీక్షతో జాగరణ చేస్తూ ఉన్నవారికి ప్రసాదంగా ఈ కందగడ్డలను ఇస్తారు అయితే ఇలా శివుడికి కందగడ్డలను నైవేద్యంగా పెట్టడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే… ప్రతి ఏడాది కందగడ్డలు ఇదే సమయానికి మార్కెట్లోకి వస్తాయి అయితే పూర్వకాలంలో శివరాత్రిరోజున అటవీ జాతికి చెందినవారు పరమేశ్వరుడికి అడవిలో దొరికే ఈ కందగడ్డలను నైవేద్యంగా సమర్పించేవారు అయితే అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే వస్తుంది.
ఇక శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల మన శరీరంలో శక్తి మొత్తం కోల్పోయి నిరసించిపోతారు. ఈ క్రమంలోనే ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ కందగడ్డను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి తిరిగి దానిని మనం ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన శరీరం శక్తిని కోల్పోకుండా మన శరీరానికి కావలసినంత శక్తిని అందించడంలో కందగడ్డలు దోహదపడతాయి. అందుకే మహాశివరాత్రి రోజు ఎక్కువగా ఉపవాస ఉండేవారు కందగడ్డలు తినడానికి ఆసక్తి చూపుతారు.