అంగన్ వాడీ టీచర్లకు అదిరిపోయే తీపికబురు.. ఉచితంగా రూ.2 లక్షలు పొందే ఛాన్స్!

తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీల టీచర్లకు అదిరిపోయే తీపికబురు చెప్పగా ఆ తీపికబురు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అంగన్ వాడీ ఉద్యోగాలు చేసే ఉద్యోగులకు అందించే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పథకాలను అమలు చేస్తున్నారని విద్యా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నారని ఆమె వెల్లడించారు.

అంగన్‌వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయని ఆమె వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. రిటైర్మెంట్ అయ్యే అంగన్‌వాడీల టీచర్లకు 2 లక్షల రూపాయలు, అంగన్‌వాడీ సహాయకులకు లక్ష రూపాయల బెనిఫిట్ అందిస్తామని సీతక్క వెల్లడించడం కొసమెరుపు. త్వరలోనే ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయనుందని తెలుస్తోంది.

అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు పౌష్టికాహారం, విద్య, భద్రత అందుతున్నాయి. మరోవైపు కాలేజ్ లలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగులను గొప్ప ఇంజనీర్లుగా చేయడానికి తమ ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలే కాకుండా విద్యారంగంపై కూడా తన ముద్ర వేయాలనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తుండటంపై నెటిజన్ల నుంచి సైతం ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.