తల్లికి వందనం స్కీమ్ అప్ డేట్ ఇదే.. అప్పటినుంచి ఈ స్కీమ్ అమలు కానుందా?

ఏపీ మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పథకాలలో తల్లికి వందనం స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ అమలైతే ఒక బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ఇస్తారని ఏపీ మహిళలు భావిస్తున్నారు. తాజాగా ఏపీ కేబినేట్ మీటింగ్ జరగగా ఈ స్కీమ్ ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. త్వరలో ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు అమలు చేయనున్నారు.

గతంలో అమలు చేసిన తల్లికి వందనం స్కీమ్ కు బదులుగా ఈ స్కీమ్ అమలు జరగనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఏపీ మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ విద్యా సంవత్సరానికి మాత్రం ఈ స్కీమ్ అమలయ్యే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది. కొంతమంది మాత్రం ఈ నెలలో ఈ స్కీమ్ ను అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఏపీ సర్కార్ అమలు చేసే ఈ స్కీమ్ వల్ల ఏపీలో దాదాపుగా 50 లక్షల మంది పిల్లలు, కోటికి అటూఇటుగా పిల్లలు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఏపీ సర్కార్ ఈ స్కీమ్ కోసం ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఏపీ సర్కార్ రాబోయే రోజుల్లో మరిన్ని స్కీమ్స్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది.

ఏపీ సర్కార్ ప్రకటించిన అద్భుతమైన స్కీమ్స్ లో తల్లికి వందనం స్కీమ్ కూడా ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు.