చాలామంది ఎత్తు తక్కువగా ఉన్నా మన్న ఉద్దేశంతో నలుగురిలో కలవడానికి సంకోచిస్తూ డిప్రెషన్ సమస్యకు లోనవుతున్నారు.ఇంకొంతమంది తమ ఎత్తు పెంచుకోవడానికి సర్జరీలు, గ్రోత్ హార్మోన్స్ వంటి ప్రమాదకర మందులను వాడుతూ తీవ్ర అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. అలాంటివారు సింపుల్గా మన ఇంట్లోనే ఉంటూ కొన్ని యోగాసనాల ద్వారా తమ శరీర ఎత్తును పెంచుకోవచ్చునని యోగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీర ఎత్తును పెంచుకోవడానికి మనం చేయవలసిన యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యోగాసనాల ద్వారా శరీర ఎత్తును పెంచుకోవడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చని వారు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని నిమిషాలపాటు వృక్షాసనం ను చేస్తే ఎత్తు పెంచుకోవచ్చు ఆసనాన్ని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. మొదట ప్రశాంతంగా నిటారుగా నిల్చొంనీ నిదానంగా శ్వాస తీసుకుంటూ మీ కుడి కాలును మీ ఎడమ మోకాలి వైపునకు మడిచి, ఎడమ కాలు మీద ఉంచండి. మీ కుడి పాదం లోపలి ఎడమ తొడను తాకాలి. మీ శరీర బ్యాలెన్సింగ్ కోసం మీ చేతులను పైకి లేపి సూర్య నమస్కారం చేయండి. ముఖ్యంగా మోచేతులు వంగకుండా చూసుకొని కొన్ని సెకండ్ల పాటు ఆసనం వేస్తే ఈ శరీరంలో ఉన్న గ్రోత్ హార్మోన్ పనితీరు మెరుగుపడి శరీర ఎత్తును పెంచుకోవచ్చు.
ఎక్కడైనా ఎంతో ఈజీగా చేయగలిగే తడాసనం గూర్చి తెలుసుకుందాం. మొదట మీ పాదాలపై నిటారుగా నిల్చొంనీ మీ భుజాలు, మెడను సమానంగా ఉంచి నిటారుగా నిలబడాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను సమానంగా పైకి ఎత్తండి. తర్వాత మీ కాలి వేళ్ళ మీద శరీర బరువును ఉంచుతూ మడమలను నెమ్మదిగా పైకి లేపి శరీరాన్ని వీలైనంత వరకు పైకి స్ట్రెచ్ చేయండి. ఈ పొజిషన్లో కాళ్లు చేతులు నిటారుగా సమాంతరంగా ఉండేలా చూసుకుంటూ వీలైనన్ని ఎక్కువసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.