ఏపీ వైద్య శాఖ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు 2.5 లక్షల వేతనంతో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. జూలై 5, 7, 10 తేదీలలో ఎపివివిపి కమీషనర్ కార్యాలయము, గొల్లపూడి, విజయవాడలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
మొత్తం 331 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్థానికత, రోస్టర్ విధానం ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. గిరిజన ప్రాంతానికి చెందిన వాళ్లకు అదనపు జీతం ఇవ్వనున్నారని సమాచారం.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. pvvpwalkinrecruitment@gmail.com సంప్రదించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. 06301138782 నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
ఏపీ వైద్య శాఖ భారీగా ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేయడంతో నిరుద్యోగులు సంతోషిస్తున్నారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. భారీ సంఖ్యలో వేతనం ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.