కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. బిజినెస్ లో సక్సెస్ సాధించాలని భావించే వాళ్ల కోసం కేంద్రం స్టాండ్ అప్ ఇండియా పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్లు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చు. 1,80,000 మంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందారు. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు 10 లక్షల రూపాయలు లభిస్తాయి.
40,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం 1,80,000 మంది రుణ గ్రహీతలకు కేంద్రం ఇస్తుండటం గమనార్హం. ఈ ఏడాది కేంద్రం 10,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను ఇచ్చింది. కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది. 2025 సంవత్సరం వరకు ఈ స్కీమ్ అమలులో ఉండగా ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ స్కీమ్ లో చేరి ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు.
ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా కోటి రూపాయల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. చేసే బిజినెస్ ఆధారంగా లోన్ ను మంజూరు చేయడం జరుగుతుంది. మహిళలకు 51 శాతం షేర్ హోల్డింగ్ ఉండాల్సి ఉండగా 18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ లోన్ పై దృష్టిపెట్టవచ్చు.
రుణాలు తీసుకుని డిఫాల్ట్ అయిన వాళ్లు మాత్రం ఈ రుణాన్ని పొందడం సాధ్యం కాదు. https://www.standupmitra.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ పేద, బలహీన వర్గాలకు చెందిన వాళ్లకు ఎంతో ప్రయోజనకర్న్గా ఉంటుంది.