ఈ స్కీమ్ ద్వారా మహిళలు సులువుగా రూ.కోటి పొందే అవకాశం.. ఎలా అంటే?

సొంతంగా వ్యాపారం చేసి పారిశ్రామికవేత్తలుగా రాణించాలని దేశంలో ఎంతోమంది మహిళలు కలలు కంటున్నారు. అయితే ఈ విధంగా కలలు అనే మహిళలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణం లభిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా రుణం తీసుకున్న వాళ్లు 18 నెలల పాటు రుణం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

స్టాండ్ అప్ ఇండియా పేరుతో ఈ స్కీమ్ అమలవుతుండగా మహిళలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన పురుషులు సైతం ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందడానికి అర్హులు. 2015 సంవత్సరం నుంచి ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు నెలకొల్పి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.

ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లలో ఎక్కువమందికి సులువుగా రుణాలు దక్కాయి. స్టాండప్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను సులువుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. తీసుకున్న రుణాన్ని 7 సంవత్సరాల లోపు చెల్లించే అవకాశం అయితే ఉంటుంది.

ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వడ్డీ రేటు 11 నుంచి 13 శాతం మధ్య ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా రుణం పొందాలంటే లోన్ రావాలంటే ప్రాథమిక హామీతో పాటు స్టాండ్ అప్ ఇండియా రుణాల క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ హామీ ఉండాలి. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ద్వారా స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది.