కరోనా వ్యాక్సిన్ల వల్లే గుండె పోట్లు వస్తున్నాయా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

Covid 19 Vaccines and Death Rate, A Big Question

గత కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్లు గుండెపోటు బారిన పడుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కరోనా వ్యాక్సిన్ల వల్లే గుండెపోట్లు పెరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్ల వల్ల ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం టెన్షన్ పడుతున్న పరిస్థితి నెలకొంది. యుక్త వయస్సుకు చెందిన వాళ్లు ఎక్కువగా మరణిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

అయితే నిపుణులు మాత్రం గుండె సంబంధిత మరణాలకు, కరోనా వ్యాక్సిన్లకు సంబంధం లేదని చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి అన్ని పరీక్షలు పూర్తయ్యాయని వాళ్లు వెల్లడిస్తున్నారు. సరైన లైఫ్ స్టైల్ లేని వాళ్లు మాత్రమే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం అయితే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుండెకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.

కరోనా వ్యాక్సిన్ల వల్లే గుండె పోటు వచ్చే అవకాశం లేదు. అయితే కరోనా సోకి కరోనా నుంచి కోలుకున్న వాళ్లు మాత్రం గుండె ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ల గురించి అనవసర అపోహలు సృష్టించవద్దని నిపుణులు కోరుతున్నారు. వ్యాక్సిన్ విషయంలో అపోహలు పడితే నష్టమని వాళ్లు తెలియజేస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటివరకు తీసుకోని వాళ్లు సైతం వెంటనే తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కరోనా వ్యాక్సిన్ వల్ల లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో మరణిస్తూ ఉండటంతో ఈ తరహా సందేహాలు చాలామందిలో వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.