పీఎం కన్యాదాన్ స్కీమ్ ఉందా.. ఆ స్కీమ్ ద్వారా 1,80,000 రూపాయలు ఇస్తారా?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ గురించి సరైన అవగాహన ఉన్నవాళ్లు ఆ స్కీమ్స్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోయినా సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ స్కీమ్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఈ ఫేక్ స్కీమ్స్ మాయలో పడి చాలా సందర్భాల్లో అమాయక ప్రజలు మోసపోతూ ఉంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో పీఎం కన్యాదాన్ స్కీమ్ గురించి తెగ వైరల్ అవుతోంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం 1,80,000 రూపాయలు ఇస్తారని తెగ ప్రచారం జరుగుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఈ తరహా ఫేక్ వార్తలను ప్రచారంలోకి తెస్తుండటం గమనార్హం. ప్రధాన్ మంత్రి కన్యా ఆశీర్వార్ యోజన స్కీమ్ ను కేంద్రం అమలు చేస్తోందంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ప్రచారం చేస్తుండటం గమనార్హం.

కేంద్రం అమలు చేయని పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ పేర్కొంది. ఈ తరహా స్కీమ్స్ పేర్లు చెప్పి కొంతమంది మోసాలకు పాల్పడుతున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ స్కీమ్ గురించి స్పందించి క్లారిటీ ఇచ్చింది. యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రచారం నిజం లేదని తేలింది. స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని మాత్రమే ఈ స్కీమ్స్ లో చేరితే మంచిది.

కొత్త స్కీమ్స్ గురించి ప్రచారం జరిగితే పూర్తిస్థాయిలో వివరాలను తెలుసుకుని మాత్రమె ఆ స్కీమ్స్ లో చేరాలి. ఎవరైనా స్కీమ్ లో చేరడానికి డబ్బులు కట్టాలని అడిగితే మాత్రం ఆ స్కీమ్ మోసపూరిత స్కీమ్ అని గుర్తుంచుకోవాలి.