రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. rbi.org.in అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 450 అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
2023 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ లోపు జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితికి సంబంధించి సడలింపులు ఉండనున్నాయి. కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీస మార్కుల విషయంలో మినహాయింపు ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో కొన్ని ఉద్యోగ ఖాళీలకు మాత్రం అనుభవం ఉన్న ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ వెబ్ సైట్ లో ఆర్బీఐ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ అనే లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆర్బీఐ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
వేర్వేరు పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులు ఆర్బీఐ బ్రాంచ్ లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా రూ.47,849 లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరగనుంది.