నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు ఇదే.. భారీ వేతనంతో ఆర్బీఐలో జాబ్స్!

దేశంలో బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. బ్యాంక్ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుతుందనే భావనను చాలామంది కలిగి ఉన్నారు. గ్రేడ్-బీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ కోసం జాబ్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఖాళీల కోసం ఆర్బీఐ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం.

 

ఈ ఉద్యోగ ఖాళీలలో లీగల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళి 1 ఉండగా మేనేజర్(టెక్నికల్- సివిల్) ఉద్యోగ ఖాళీలు 3, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 5, లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఖాళీలు 1 ఉన్నాయి. 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా మేనేజర్ (టెక్నికల్- సివిల్) ఉద్యోగాలకు కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ పాసైన వాళ్లు అర్హులు. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండి హిందీ ట్రాన్స్‌లేషన్‌లో సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు. 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.

 

ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి లైబ్రరీ సైన్స్ లో అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. opportunities.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్బీఐ రిక్రూట్‌మెంట్-2023 లింక్‌ ద్వారా ఈ ఉద్యోగా ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.