నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. రూ.71 వేల శాలరీతో ఉద్యోగాలు!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా ఈ సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ నెల 9వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. chance.rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

జూన్ నెల 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం. జులై నెల 15వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష జరగనుందని సమాచారం అందుతోంది. మొత్తం 35 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలలో జూనియర్ ఇంజనీర్ (సివిల్) ఉద్యోగ ఖాళీలు 29 ఉండగా జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 6 ఉన్నాయి.

20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 2 సంవత్సరాల డిప్లొమా హోల్డర్‌గా అనుభవం ఉన్నవాళ్లు జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్ట్ ఉద్యోగాలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. రాత పరీక్ష, భాషా నైపుణ్య పరీక్ష,డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 150 నిమిషాల వ్యవధితో ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.