రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 291 గ్రేడ్ బీ ఆఫీసర్ జాబ్స్.. భారీ వేతనంతో?

RBI brings new rules on debit and credit card transactions

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రేడ్ బీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్బీఐ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల కాగా డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ప్రారంభ వేతనం 55,200 రూపాయలుగా ఉండనుంది.

 

మొత్తం మూడు విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం గమనార్హం. ఈ ఉద్యోగాల్లో గ్రేడ్ బి ఆఫీసర్ జనరల్ ఉద్యోగ ఖాళీలు 222 ఉండగా గ్రేడ్ బి ఆఫీసర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ ఉద్యోగ ఖాళీలు 38 ఉన్నాయి. గ్రేడ్ బి ఆఫీసర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ మెంట్ డీ.ఐ.ఎస్.ఎం. ఉద్యోగ ఖాళీలు 31 ఉన్నాయి. గ్రేడ్ బి ఆఫీసర్ జనరల్ ఉద్యోగ ఖాళీలకు 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

55 శాతం మార్కులతో పీజీ పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. గ్రేడ్ బీ ఆఫీసర్ డీఈపీఆర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఎంబీఏ లేదా పీజీడీఎం పాసవ్వాలి. కనీసం 55 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. గ్రేడ్ బి ఆఫీసర్ డీ.ఐ.ఎస్.ఎం ఉద్యోగ ఖాళీలకు 55 శాతం మార్కులతో పీజీ పాసైన వాళ్లు అర్హులు.

 

2023 సంవత్సరం మే 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఇతర అభ్యర్థులకు భారీ వేతనం లభించనుంది. ఫేజ్1 పరీక్ష 200 మార్కులకు నిర్వహించనుండగా ఫేజ్2 పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారని తెలుస్తోంది. పేపర్1లో అర్హత సాధిస్తే మాత్రమే పేపర్2, పేపర్3 లను నిర్వహించడం జరుగుతుంది. ఆర్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.