రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. rbi.org.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.
20 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. 2003 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ లోపు జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కనీస మార్కుల విషయంలో మినహాయింపు ఉండటంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. ఆర్బీఐ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 21, 23 తేదీలలో జరగనుండగా మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్ 2వ తేదీన జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు ఏకంగా రూ.47,849 వేతనం లభించనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ బ్రాంచ్ లలో పని చేయాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో మేలు జరగనుంది.