డబ్బులు దాచుకోవాలని భావించే వాళ్లకు ఎన్నో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లేదంటే సేవింగ్ స్కీమ్స్, బ్యాంక్ ఎఫ్‌డీలలో డబ్బులు పొదుపు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే రిస్క్ ఉన్న స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కంటే రిస్క్ లేని స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చాలామంది భావిస్తారు. నచ్చిన స్కీమ్ ను ఎంచుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అదిరిపోయే స్కీమ్ ను అందిస్తోంది. మహిళలు లేదా బాలికల పేరిట 2 సంవత్సరాల కాలవ్యవధికి ఈ స్కీమ్ ద్వారా 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. 2023 సంవత్సరంలో ఈ స్కీమ్ మొదలుపెట్టగా 2025 సంవత్సరం మార్చి వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది.
ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెండేళ్ల కాలానికి వడ్డీ రూపంలోనే 32,000 రూపాయలకు పైగా పొందవచ్చు. మీకు నచ్చిన మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసే అవకాశం ఉండగా గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి 7.5 శాతం వడ్డీ రేటు లభించనుందని సమాచారం అందుతోంది.
ఈ స్కీమ్ పై ఆసక్తి ఉన్న మహిళలు వెంటనే సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ బ్రాంచ్ లను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.