కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం పీఎం కిసాన్ సాయాన్ని 12 వేల రూపాయలకు పెంచనుందని సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ను ప్రకటించనుండగా ఆ సమయంలో ఈ మేరకు ప్రకటన చేయనుందని తెలుస్తోంది.
మహిళా రైతులకు మాత్రమే 12,000 రూపాయల పెంపును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందెని సంగతి తెలిసిందే. సాధారణ రైతులకు సైతం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ డబ్బును 6 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయలకు పెంచనుందని తెలుస్తోంది.
పీఎం కిసాన్ స్కీమ్ నగదును కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా కోట్ల సంఖ్యలో రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలను పొందారు. పీఎం కిసాన్ స్కీమ్ వల్ల ఎంతోమంది రైతులకు పెట్టుబడి సహాయం అందుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా కేంద్రం ఈ స్కీమ్స్ ను అమలు చేస్తుండటం గమనార్హం. పీఎం కిసాన్ స్కీమ్ కు పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందుతున్నారు. పీఎం కిసాన్ స్కీమ్ పెంపు దిశగా అడుగులు పడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.