పదో తరగతి మంచి మార్కులతో పాసైన విద్యార్థులకు బెనిఫిట్ కలిగేలా భారీ సంఖ్యలో పోస్టాఫీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏకంగా 40 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఎంచుకునే బ్రాంచ్ ఆప్షన్లు, మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు రోజుకు నాలుగు గంటలు పని చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే మాత్రం వాటికి సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఈ తప్పులను సరిదిద్దుకోని పక్షంలో ఉద్యోగం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, కులం, అడ్రస్, ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. మిగతా వివరాలను మాత్రం మార్చుకోవడం సాధ్యం అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కనీసం 90 శాతం పాస్ పర్సెంటేజ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత సాధించే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండటంతో పాటు సంబంధిత కార్యాలయానికి అందుబాటులో ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఉన్నత చదువులతో సంబంధం లేకుండా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. పదో తరగతి మంచి మార్కులతో పాసైన వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.
పోస్టాఫీస్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మొదట వేతనం తక్కువే అయినా రాబోయే రోజుల్లో వేతనం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోస్టాఫీస్ ఉద్యోగాలు ఉన్నత చదువులు చదువుకోని వాళ్లకు మరింత బెనిఫిట్ ను కలిగించనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.