రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ పోస్టుల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ddpdoo.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.
జులై 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. రెగ్యులర్ మోడ్ ద్వారా గ్రాడ్యుయేట్ (ఇంజనీరింగ్) పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటీస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టేట్ కౌన్సిల్ లేదా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయోపరిమితి 14 సంవత్సరాలు కాగా గరిష్ట వయో పరిమితికి ఎలాంటి నిబంధనలు లేవని సమాచారం అందుతోంది.
గ్రాడ్యుయేట్, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ చేసే వాళ్లకు నెలకు 9000 రూపాయలు లభించనుండగా టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ చేసేవాళ్లకు నెలకు రూ. 8,000 లభించనుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుండగా ఫైనల్ ఇయర్ మార్కుల ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియను చేపడతారు. ఈ జాబ్స్ కు ఎంపికైన వాళ్లకు మెడికల్ టెస్ట్, పోలీస్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది.