ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 19 చార్టర్డ్ అకౌంటెంట్, టీమ్ లీడ్ ఉద్యోగ ఖాళీల కోసం తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.
ఆఫ్ లైన్ ద్వారా కూడా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఈ నెల 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా టీమ్ లీడ్ – ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ సేల్స్ 9 ఉండగా మిగిలిన ఉద్యోగ ఖాళీలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగులు అర్హులు.
సీఏ ఉద్యోగ ఖాళీలకు మాత్రం 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు రుసుము 1000 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది.
అర్హత, అనుభవం, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ చెన్నై అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంచుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.