ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో మొబైల్ తయారీ కంపెనీలు కూడా ఒకదానితో ఒకటి పోటీపడి మరి సరికొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ (IQOO) నుంచి భారత మార్కెట్లోకి కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. iQOO నుండి వస్తున్న ఈ సరికొత్త కొత్త 5G ఫోన్లో అనేక ఫీచర్లు ఉన్నాయి. మార్చి 21న (iQOO Z7 5G) భారత మార్కెట్ లో లాంచ్ కానుంది. iQOO Z7 లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12:00 గంటలకు జరగనుంది. ఈ ఈవెంట్ మొత్తం iQOO YouTube ఛానెల్ ద్వారా లైవ్ టెలిక్యాస్ట్ కానుంది.
iQOO Z7 ధర రూ. 20వేల లోపు ఉంటుంది. ఈ ఫోన్ సరసమైన డివైజ్ అల్ట్రా-బ్రైట్ AMOLED డిస్‌ప్లేని అందిస్తుంది. ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇక సేల్ లో ఈ ఫోన్ రూ. 15,499కి అందుబాటులో ఉండనుంది. అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్ల కారణంగా కొత్త వెర్షన్ ధర ముందున్న దాని కంటే ఎక్కువగా ఉండవచ్చు. మార్చి 21న ఈ లంచ్ చేసిన సందర్భంగా అన్నీ విషయాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. ప్రస్తుతానికి మెమరీ ఆప్షన్‌లపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇక ఈ iQOO Z7 అమెజాన్ (Amazon Sale) ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.
iQOO Z7 ఫోన్ OIS సపోర్టుతో 64-MP ప్రైమరీ కెమెరాతో పాటు ఈ డివైజ్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే సరికొత్త ఫ్రేమ్‌లతో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ సమయంలో, బ్రాండ్ గతంలో అందించిన స్నాప్‌డ్రాగన్ కు బదులుగా MediaTek చిప్‌తో డివైజ్ లాంచ్ చేస్తోంది. iQOO Z7 డైమెన్సిటీ 920 SoC ద్వారా పవర్ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ Funtouch OS 13 అవుట్ ది బాక్స్‌తో వస్తుంది. హుడ్ కింద, 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ డివైజ్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ ఛార్జర్ బ్యాటరీని 1 శాతం నుంచి 50 శాతానికి ఛార్జ్ చేసేందుకు 25 నిమిషాలు పడుతుందని కంపెనీ పేర్కొంది.