నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థ అయిన ఈ సంస్థ జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కెల్ 1 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 266 ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈరోజు నుండి ఈ ఉద్యోగ ఖాళీల దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా జులై నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
జనరలిస్ట్ 170, ఎంబిబిఎస్ డాక్టర్లు 14, లీగల్ 20, ఫైనాన్స్ 21, ఐటీ 20, ఆటోమొబైల్ ఇంజనీర్లు 21 ఉన్నాయి. డిగ్రీ, బీకామ్, బీఈ, బీటెక్, ఎంబిబిఎస్, పీజీ, ఎల్.ఎల్.ఎం, ఎంకామ్, ఎం.ఈ, ఎం.ఎస్, ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. 2025 సంవత్సరం మే 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎస్సి, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు, ఓబీసీలకు రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 50925 రూపాయల నుండి 90000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://nationalinsurance.nic.co.in/> వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి.
జనరల్, ఓబీసీ, ఈ.డబ్ల్యు.ఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది. ప్రిలిమినరీ పరీక్షా, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.