ప్రస్తుతం మనకు ఎంతో ఉపయోగపడే డాక్యుమెంట్లలో ఆధార్ ఎంతో ప్రయోజనకరమైనది అని చెప్పాలి. ఇలా ఆధార్ కార్డు మన బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలుకొని పాన్ కార్డ్,వీసా పాస్పోర్ట్ వరకు కూడా ఈ ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉంది ఇలా ఎంతో ముఖ్యమైనటువంటి ఈ ఆధార్ కార్డును ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలనే విషయం మనకు తెలిసిందే. ఇలా ఆధార్ కార్డు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వే 2023ని పార్లమెంట్‌లో పెట్టారు.
ప్రభుత్వ సామాజిక పథకాలను పొందేందుకు ఆధార్ ఎంతో అవసరం. అయితే 318 కేంద్ర ప్రభుత్వ పథకాలు, 720 డీబీటీ పథకాలు ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 7 కింద నోటిఫై అయ్యిందన్నారు. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడి ఉంటుంది.ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ (ఏపీబీ) ద్వారా ఎవరైనా కూడా ఆధార్ నంబర్‌తో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం పథకాలను అందుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, బ్రాంచ్ వివరాలు ఇవ్వాలి.
ఈ పేమెంట్ సిస్టం తో ఆధార్ సహాయం తో అకౌంట్ నుండి డబ్బులు తీసుకోవచ్చు. పంపచ్చు. డోర్ స్టేప్ బ్యాంకింగ్ కూడా పొందొచ్చు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా వృద్ధులు పెన్షన్ తీసుకుని సదుపాయం ఉంది. ఒకవేళ తంబ్ పడకపోయినా సమయంలో ఫేస్ అథెంటికేషన్ తీసుకోవచ్చు.ఇలా ప్రభుత్వం నుంచి మనం ఏ పథకానికి అయినా లబ్ధిదారులుగా ఉండి ఆ పథకానికి సంబంధించిన డబ్బులు అందుకోవాలని తప్పనిసరిగా ఆధార్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసే ఉండాలి.