తెలంగాణలో 5 వేల ఉద్యోగాలకు జాబ్ మేళా.. సాయంత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు?

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తుండటం గమనార్హం. మరో భారీ జాబ్ మేళా దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ జాబ్ మేళాలో 90 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొననున్నాయని సమాచారం. ఈ నెల 4వ తేదీన ట్రినిటి విద్యా సంస్థల ఆవరణలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఆరోజు ఉదయం నుంచి రిజిష్టర్ చేసుకుని జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎవరైతే ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగం పొందుతారో వాళ్లకు ఆరోజు సాయంత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. 90కు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని సమాచారం అందుతోంది. పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ అర్హత ఉన్న అభ్యర్థులు అయినా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.

వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగుల సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీగానే వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ప్రైవేట్ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.