పరిమిత కాలం ప్రీమియం చెల్లించి 100 ఏళ్ల వరకు బీమా పొందేందుకు జీవన్ ఉత్సవ్ ప్లాన్ బెస్ట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారు పాలసీ మొత్తంలో ఏటా 10 శాతం జీవితాంతం పొందే అవకాశం ఉంటుంది. నిర్ణీత కాలం తర్వాత ఈ మొత్తన్ని పొందే బెనిఫిట్ మొదలవుతుంది. నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ పాలసీ అయిన జీవన్ ఉత్సవ్ ఎంతోమందికి లాభాలను చేకూరుస్తుంది.
పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించి లాక్ ఇన్ పీరియడ్ తర్వాత ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందవచ్చు. 90 రోజుల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి అందుబాటులో ఉండే ఈ పాలసీ వల్ల ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి. జీవితకాల ఆదాయాన్ని, బీమా కవరేజీని ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. కనీసం ఐదేళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రీమియం చెల్లించే సమయంలో ప్రతి 1000 రూపాయలకు 40 రూపాయల చొప్పున గ్యారంటీ అడిషన్స్ జమవుతాయి. దీర్ఘకాలంలో బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ సూపర్ స్కీమ్ అవుతుంది. పాలసీదారు మరణించిన సందర్భంలో పాలసీ యాక్టివ్‌గా ఉన్నట్లయితే, నామినీకి డెత్ బెనిఫిట్ లభిస్తుందని చెప్పవచ్చు. డెత్ బెనిఫిట్ మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం కంటే తక్కువ కాకుండా చెల్లిస్తారు.
బేసిక్ సమ్ అష్యూర్డ్ లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఏది ఎక్కువ అయితే అది పొందవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఎల్ఐసీ పాలసీలను తీసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి.