ఎల్ఐసీ సూపర్ పాలసీ.. కేవలం రూ.125 పొదుపుతో రూ.27 లక్షలు పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా తక్కువ ప్రీమియంతో అధిక లాభం పొందాలని భావించే వాళ్లకు ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీ ఉత్తమమైన పాలసీ అని చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు రోజుకు కేవలం 125 రూపాయలు పొదుపు చేయడం ద్వారా రూ. 27 లక్షలు లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఎల్ఐసీ పాలసీలను తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ఊహించని స్థాయిలో ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. జీవన్ లక్ష్య పాలసీ నాన్ లింక్డ్ ప్లాన్ కాగా సేవింగ్స్‌తో పాటుగా ప్రొటెక్షన్ లభించే ఈ ప్లాన్ ను తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం వల్ల మరణిస్తే నామినీకి ప్రతి ఏటా కొంత మొత్తం లభించడంతో పాటు పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఈ పాలసీ తీసుకున్న వాళ్లు బీమా మొత్తంతో పాటు బోనస్, అదనపు బోనస్ కూడా పొందవచ్చు. ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటారో వాళ్లకు వాళ్లకు రుణ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ పాలసీని తీసుకున్న వాళ్లు సెక్షన్ 80సీ కింద పాలసీ ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపు బెనిఫిట్స్ ను పొందవచ్చు. 10 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే రోజుకు 125 రూపాయల చొప్పున పొదుపుతో మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.27 లక్షలు పొందవచ్చు.

ఈ విధంగా పొదుపు చేయడం ద్వారా మెచ్యురిటీ సమయంలో ఏకంగా రూ. 27 లక్షలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్, ఇన్‌కమ్ ప్రూఫ్, ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అందించి ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ టెన్యూర్ లో ప్రతి సంవత్సరం 10 శాతం బీమాగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.