ఎల్ఐసీ జీవన్ ధార పాలసీ అదిరిపోయే బెనిఫిట్స్ ఇవే.. అదిరిపోయే బెనిఫిట్స్ పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న పాలసీలలో ఎల్ఐసీ జీవన్ ధార పాలసీ కూడా ఒకటి. జీవన్ దారా2 పేరుతో ఈ పాలసీ అమలవుతుండగా ఈ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ కావడం గమనార్హం. ఆన్ లైన్ ద్వారా ఆఫ్ లైన్ ద్వారా ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలసీ మొత్తం 11 ఆప్షన్లలో అమలవుతోంది.

డిఫర్ మెంట్ పీరియడ్ లో బీమా కవరేజ్ పొందే అవకాశం ఉండగా మలి దశలో పెన్షన్ కోరుకునే వాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్లలో జీవిత కాలం యాన్యుటీ మొదటి ఆప్షన్ కాగా యాన్యుటీతో పాటు ప్రీమియం మొత్తం వాపస్ రెండో ఆప్షన్ గా ఉంది. 75 ఏళ్లు దాటిన తర్వాత 50 శాతం ప్రీమియంతో పాటు లైఫ్ లాంగ్ యాన్యుటీ పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.

నాలుగో ఆప్షన్ లో 75 ఏళ్లు దాటిన తర్వాత 100 శాతం ప్రీమియంతో పాటు జీవితాంతం యాన్యుటీ లభిస్తుంది. 5వ ఆప్షన్ తీసుకుంటే 80 ఏళ్ల తర్వాత 50 శాతం ప్రీమియంతో పాటు లైఫ్ లాంగ్ యాన్యుటీ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంలో మాత్రం కేవలం రెండంటే రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ను ఎంచుకుంటే ఆ ఆప్షన్ ను మార్చుకునే ఛాన్స్ అయితే ఉండదు.

కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి మొదలుకానుండగ లక్ష రూపాయలు చెల్లిస్తే ఈ మొత్తం పొందవచ్చు. ఎల్.ఐ.సీ వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.