ఎల్ఐసీ సూపర్ పాలసీ.. ఈ స్కీమ్ తో ఏకంగా 11 లక్షలు పొందే అవకాశం?

ఎల్ఐసీ పాలసీకి ప్రస్తుత కాలంలో ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. ఇన్సూరన్స్ గురించి నామ మాత్రపు అవహన ఉన్నా ఈ పాలసీ తీసుకుంటే మంచిది. ఎల్ఐసీ ప్రస్తుతం వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తోంది. పిల్లల వయస్సు, ఆదాయం, ఇతర అంశాల ఆధారంగా ఎంచుకునే పాలసీ విషయంలో మార్పులు ఉంటాయి.

ఎల్ఐసీ పాలసీలలో ఊహించని స్థాయిలో పాపులర్ అయిన పాలసీ ఏదనే ప్రశ్నకు జీవన్ ఆనంద్ పాలసీ పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి 17 వేల రూపాయలు చెల్లిస్తే 25 లక్షల రూపాయలకు పాలసీ తీసుకోవచ్చు. తక్కువ మొత్తం పొదుపు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ లభిస్తాయి.

ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు సైతం ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మెచ్యూరిటీ తర్వాత ఫైనల్ బోనస్ కింద 11.50 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. పాలసీని కనీసం 15 సంవత్సరాలు కొనసాగించిన వాళ్లు ఈ స్కీమ్ ద్వారా రెండుసార్లు బోనస్ ను పొందవచ్చు. ఏజెంట్ ను సంప్రదించి ఈ స్కీమ్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

తక్కువ వయస్సులో ఈ స్కీమ్ ను తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పవచ్చు. అవసరాలకు అనుగుణంగా రైడర్లను ఎంపిక చేసుకొవడం ద్వారా కూడా మేలు జరుగుతుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు ఏదైనా కారణం వల్ల మృతి చెందితే నామినీకి డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి.