ఎల్ఐసీ సూపర్ పాలసీ.. రూ.165 పొదుపుతో రూ.37 లక్షల రాబడి పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఆ పాలసీలలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయి. ఎల్ఐసీ నుంచి అద్భుతమైన మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీ ధన్ రేఖ పాలసీ అని చెప్పవచ్చు. కేవలం రూ.165 పొదుపుతో రూ.37 లక్షల రాబడి పొందే ఛాన్స్ ఉండటంతో ఈ పాలసీ సూపర్ పాలసీ అవుతుంది. పాలసీ టర్మ్ పూర్తయిన తర్వాత భారీగా సొమ్మును పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది.

ఒకేసారి ప్రీమియం కట్టి పాలసీని కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ పాలసీ సూపర్ పాలసీ అవుతుంది. 55 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పాలసీ కొనుగోలు చేసే ఛాన్స్ ఉండగా 20, 30, 40 ఏళ్లుగా పాలసీ టర్మ్ ఉండనుందని తెలుస్తోంది. ఎంచుకునే టైమ్ ను బట్టి ప్రీమియం మారే ఛాన్స్ ఉండటంతో ఈ పాలసీ తీసుకునే మొత్తంను బట్టి ప్రీమియం కూడా మారే ఛాన్స్ అయితే ఉంటుంది.

30 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు 40 ఏళ్ల టర్మ్‌తో రూ. 10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలవారీ ప్రీమియం రూ. 4950గా ఉంటుంది. పాలసీ 20వ సంవత్సరంలో రూ. 2 లక్షలు, 25వ సంవత్సరంలో రూ. 2 లక్షలు పొందే అవకాశం ఉండగా 30, 35 సంవత్సరాలలో సైతం 2 లక్షల రూపాయల చొప్పున పొందే అవకాశం అయితే ఉంటుంది. 40వ సంవత్సరంలో రూ. 29 లక్షల వరకు మెచ్యూరిటీ డబ్బులు పొందవచ్చు.

30 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు 49 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా ఉంటుంది. ఎంచుకునే కాలం ఆధారంగా వచ్చే రాబడి, ప్రీమియం మారుతుంది. పూర్తి వివరాలను తెలుసుకుని పాలసీ కొనుగోలు చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.