దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఎల్‌ఐసీ అమృత్ బాల్ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్నారుల కోసం ఈ పాలసీ బెస్ట్ పాలసీ అని చెప్పవచ్చు. చిన్నారులకు ఉన్నత విద్య అందించాలని భావించే వాళ్లు ఈ పాలసీపై ఫోకస్ పెడితే మంచిది. ఈరోజు నుంచి ఈ పాలసీ అమలవుతుండటం గమనార్హం.
నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీగా ఈ పాలసీ అమలవుతోంది. ఈ పాలసీకి అతి తక్కువ పాలసీ చెల్లింపు కాలవ్యవధి ఉండగా ఒకేసారి చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఈ పాలసీలో చెల్లించిన డబ్బులకు ఆకర్షణీయమైన గ్యారంటీడ్ అడిషన్ 1000కు 80 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ప్రీమియం కాల వ్యవధిలో బీమా హామీ కూడా పొందవచ్చు.
18 నుంచి 25 సంవత్సరాల వయస్సు మధ్య ఈ పాలసీ మెచ్యూర్ అయ్యే అయ్యే అవకాశాలు ఉంటాయి. 13 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్నారి కోసం ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ 2 లక్షల రూపాయలు కాగా చెల్లింపు సామర్థ్యం ఆధారంగా ఎక్కువ మొత్తం కూడా ఎంచుకునే అవకాశాలు ఉంటాయి.
పాలసీ సమయంలో పాలసీదారుడికి ఏమైనా జరిగితే డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి. పాలసీకి రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ పాలసీకి రుణ సదుపాయం కూడా ఉంది. 5 ఏళ్ల బాబు పేరుపై 5 లక్షల రూపాయలకు పాలసీ తీసుకుని ప్రీమియం టర్మ్ ఏడేళ్లు పాలసీ టర్మ్ 20 ఏళ్లుగా ఉంటే మెచ్యూరిటీ కింద 13 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.