పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో 510 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. నంద్యాల జిల్లాలోని కోయిలకుంట్ల మండలంలో ఉన్న ఎస్వీబీసీ గవర్నమెంట్ కాలేజ్ లో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశారని సమాచారం అందుతోంది. ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. గ్రీన్ టెక్ ఇండస్ట్రీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పెట్రో డ్రగ్స్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు లభించనుందని తెలుస్తోంది.

బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంబీఏ, ఆర్గానిక్ కెమిస్ట్రీ పాసైన వాళ్లు ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హత జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు రెజ్యూమ్ తీసుకుని ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. కే. సుబ్బన్న (9440224291) నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

skilluniverse.apssdc.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఫార్మల్ డ్రెస్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.