పదో తరగతి పాసైన వాళ్లకు ఎయిర్ క్రాఫ్ట్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో?

ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. మార్చి నెల 20వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. aiesl.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 371 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇంజనీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉన్న అభ్యర్థులతో పాటు ఎస్.ఎస్.సీ, ఎన్.సీ.వీ.టీ గుర్తింపును కలిగి ఉన్న డిప్లొమా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాలు లిమిట్ కాగా ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాలు వయోపరిమితిగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు 500 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా మిగతా అభ్యర్థులకు 1000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ వల్ల బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. ఎక్కువ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో మేలు జరుగుతోంది.