ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. సౌత్ సెంట్రల్ జోన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. 42 హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేసి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అర్హతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, ఒడిసా, మహారాష్ట్రా రాష్ట్రాలలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలోనే వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఇంటర్వ్యూతో పాటు మెడికల్ ఫిట్ నెస్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఏప్రిల్ 3, 4 తేదీలలో వీఎస్‌ఎస్ నగర్, భువనేశ్వర్ లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావడం ద్వారా సులువుగా ఎంపిక కావచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది.