రోజుకు రూ.71 పొదుపు చేస్తే చేతికి రూ.48 లక్షలు.. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది తమ సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సంపాదనను భవిష్యత్తు కొరకు పెట్టుబడిగా పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మన దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఉండగా సరైన ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిది. టెన్షన్, రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఎన్నో మంచి పాలసీలు ఉన్నాయి.

రోజుకు 71 రూపాయలు పొదుపు చేయడం ద్వారా ఏకంగా 48 లక్షల రూపాయలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీ గురించి ఆసక్తి ఉన్నవాళ్లు పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని పెట్టుబడులు పెడితే మంచిది. ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ పాలసీ ద్వారా భారీ ప్రయోజనాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లకు ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

కనీస సమ్ అష్యూర్డ్ అమౌంట్ రూ.1 లక్షకు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 18 ఏళ్ల వయస్సులో రోజుకు రూ.71 ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో భాగంగా నెలకు రూ.2130 చెల్లిస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా 48.40 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.

దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మన దేశంలో చాలామంది తక్కువ పొదుపుతో ఎక్కువ లాభం పొందాలని భావిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.