నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో ఇండియన్ ఆర్మీలో జాబ్స్!

దేశసేవ చేయాలని భావించే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా అదిరిపోయే తీపికబురు వెలువడింది. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీలో కచ్చితంగా పని చేయాలనే ధృడ సంకల్పం కలిగి ఉన్నవాళ్లకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మొత్తం 15 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలలో పురుషులకు 12 ఉద్యోగ ఖాళీలు ఉండగా మహిళలకు 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. జూన్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండటం హాట్ టాపిక్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

https://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, ఆప్టిట్యూడ్ పరీక్షలో పాస్ అయిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మన దేశానికి చెందిన పౌరులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2024 మే 20 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.