మన దేశంలో చాలామంది ఆర్మీకి వెళ్లి సేవలు అందించాలని భావిస్తున్నారు. భారత రక్షణ దళాల్లో సేవలు అందించాలనే ఆలోచన ఉన్నవాళ్లకు షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ తీపికబురు అందించింది. పెళ్లి కాని మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. joinindianarmy.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ కోర్సుకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 194 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టెక్ పురుషుల ఉద్యోగ ఖాళీలు 175 ఉండగా మహిళల ఉద్యోగ ఖాళీలు 19, ఇతర ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి.
20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. joinindianarmy.nic.in వెబ్ సైట్ ను విజిట్ చేసి ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 49 వారాల ట్రైనింగ్ ఉంటుందని సమాచారం అందుతోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కోసం ఆర్మీ నుంచి జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభిస్తుందని సమాచారం అందుతోంది.