ఇండియన్ ఆర్మీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 139 వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. బీటెక్ పాసైన అభ్యర్థులు టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో 12 నెలల పాటు శిక్షణ తీసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 30 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండగా వరుసగా జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. 20 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి.
బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ, ఇంజనీరింగ్ కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను సిద్ధం చేసి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియను చేపడతారని సమాచారం అందుతోంది. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు రూ.2,50,000 వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ట్రైనింగ్ ఉంటుంది అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.