దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఈ మధ్య కాలంలో వరుస జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నా తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉండటం వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇండియన్ ఆర్మీ నుంచి మ్రో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 138వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది.
ఎవరైతే ఈ కోర్సును పూర్తి చేస్తారో వాళ్లు సైన్యంలో అధికారుల హోదాను పొందే అవకాశం అయితే ఉంటుంది. పెళ్లి కాని బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 40 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.
మన దేశ పౌరసత్వంతో పాటు నేపాల్ పౌరసత్వం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోని ప్రముఖ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నెల 18వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం అందుతోంది. కట్-ఆఫ్ శాతం ను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.